Thursday, May 20, 2021

Shantaram - Gregory David Roberts


హమ్మయ్య!! ఇన్నాళ్లకు ఈ రిచువల్ పూర్తి చెయ్యగలిగా. ప్రతీ ఇన్స్టిట్యూట్ లో చదివేవాళ్ళకి వాళ్ళకే ప్రత్యేకమైన కొన్ని రిచువల్స్ వుంటాయి, వాళ్ళు వాటితో ఎంత కనెక్ట్ అవుతారో మిగిలిన వాళ్ళకి అంత అబ్సర్డ్ గా తోచచ్చు. మాకు ఐఐఎం లక్నౌ అట్లా ప్రత్యేకం Manfest, వర్చస్వ ఇంకా ఈ శాంతారాం. గ్రెగొరీ డేవిడ్ రోబెర్ట్స్ 2003లో రాసిన ఈ నవల కాస్త పుస్తకాల పురుగులు అనబడే పిల్లలందరి చేతుల్లో హస్తభూషణంలాగా వుండేది. పొద్దున్నే క్విజ్ ఉన్నా ఇది చదివే పిల్లలు ఆపేవాళ్లు కాదు. మనం అప్పట్లో కాస్త టైం దొరికినా మానేజ్మెంటు క్లాసిక్స్, బిజినెస్ జనాల బయోగ్రఫీలు మాత్రం పుచ్చుకునేవాళ్ళం. ఇక పిజిపి ఉక్కిరిబిక్కిరి క్లాసులు, సెమినార్లు, క్విజ్లు, మిడ్ టర్మ్స్, ఎండ్ టర్మ్స్ గోల్డెన్ రెండేళ్లు అయ్యాక మొదలయ్యే మహా నీరసపు సాలిట్యూడ్ రీసెర్చ్ పీరియడ్లో వేరే ఇంకెందుకూ వీలు కుదరదు, 'క్షణం తీరిక లేదు దమ్మిడీ ఆదాయం లేదు' సర్వీస్. ఓ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ కాదు, మళ్ళీ ఏమీ చెయ్యట్లేదు అనలేం, అదో స్థితి అంతే. పుట్టేవాళ్ళకి పురుళ్ళు పెరిగేవాళ్ళకి పుణ్యాలు అన్నట్టు బ్యాచ్ తర్వాత బ్యాచ్ ఒక మూడు నాలుగింటిని సాగనంపాకకానీ మాకు మోక్షమ్ దొరికేదికాదు. ఆ రకంగా బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ ఈ పుస్తకరాజాన్ని పోషిస్తుంటే ఎన్నోసార్లో అనుకున్నా పట్టుకుందామా అని, అప్పుడా 934 పేజీలు నన్ను పక్కకు నెట్టేది వద్దుపో అని. చిత్రంగా ఇది వి. శాంతారాం జీవితచరిత్రేమో, వీళ్లంతా ఇట్లా చదువుతున్నారేంటా అని కూడా అనుకున్నా, ఎప్పుడైనా ఒకళ్ళిద్దరితో మాటల్లో బొంబాయి గురించి బాగా తెలుసుకోవచ్చు అని విన్నా, వాళ్లంతా చేరబోయేది అక్కడికే కాబట్టి భలేగా చదివేవాళ్ళు. మొత్తానికి నేను అసలు పుస్తకం కంటెంట్ కూడా తెలుసుకోలేదు. ఇన్నాళ్ళకి మళ్ళీ కిండిల్ లైబ్రరీ చూస్తుంటే నన్ను ఇట్లా ఎన్నేళ్లు లైబ్రరీలో పెట్టి ఉంచుతావ్ అని అడిగినట్టు తోచి ఒక బలహీన క్షణాన మొదలుపెట్టా. అలెక్సా చిట్టితల్లి సహాయం కూడా తక్కువది కాదు. చదవగలినప్పుడు చదవడం, వేరే coginitive ఎబిలిటీ అవసరం లేని పని చేసేటప్పుడు వినడం ఇట్లా పూర్తి చేసేసా. అదీ హమ్మయ్యకి కారణం.

కథ ఏమీ రాయలేను చాలా ఎక్కువ రాయాలి కాబట్టి, టూకీగా చెప్పాలంటే గ్రెగొరీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలని ఆధారంగా చేసుకుని బొంబాయి వాతావరణం backdrop లో ఒక బృహద్నవలగా రాసిన పుస్తకం. ప్రొటాగనిస్ట్ లిమ్ కి గ్రెగొరీ జీవితమే ఆధారం. ఆస్ట్రేలియా జైలు నుంచి తప్పించుకుని ఇంటర్పోల్ లిస్టెడ్ మనిషిగా నకిలీ పాస్పోర్ట్ తో ఇండియాకి వచ్చి బొంబాయిని, ఇండియాను, జీవితాన్ని, తనని తెలుసుకుంటాడు లిమ్. బొంబాయి రోడ్లు, మనుషులు, వాతావరణం, ఆర్థిక రాజధాని వ్యవహారం, అక్కడి మురికివాడల జీవితం, అన్నిటినీ మించి అక్కడి అండర్ వరల్డ్ మాఫియా, అప్పుడప్పుడే పెరుగుతున్న రెలిజియస్ డివైడ్, శివసేన బలపడుతున్న వైనం, అండర్ వరల్డ్ కి పాకిస్థాన్ తో ఆఫ్ఘనిస్తాన్ ముజాహిదీన్ లతో ఉన్న సంబంధం, ఆఫ్ఘనిస్థాన్ లోని అంతర్యుద్ధాలకి రష్యా కి అమెరికా కి ఉన్న సంబంధాలు అన్నిటిగురించి ఆథేన్టక్ చిత్రణ. నాటకీయత వుంటుంది, దాంతోపాటే పార్లల్ గా బోలెడంత ఫిలసాఫికల్ డిస్కషన్. అన్నిటితో మనం ఏకీభవించాలని లేదు, కానీ చాలా బలమైన రీసనింగ్ తో వుండే విశ్లేషణలు.
సరే, శాంతారాం ఎక్కణ్ణుంచి వచ్చాడు అన్నది మాత్రం చెప్పాలి. లిమ్ బొంబాయికి రాగానే ప్రభాకర్ ఖరే అన్న చక్కగా నవ్వే టూరిస్ట్ గైడ్ పరిచయం అవుతాడు. అక్కడ మొదలై ఇద్దరూ ప్రాణమిత్రులు అవుతారు. ప్రభాకర్ తన ఊరికి తీసికెళ్ళినప్పుడు ప్రభాకర్ తల్లి లిమ్ కి అతని స్వభావాన్ని గమనించి ఈ పేరు పెడుతుంది. ఒకరకంగా తమ కుటుంబంలో కలుపుకుంటారు వాళ్ళ ఇంటిపేరు కూడా ఇచ్చి. ఇంత నేర సమాజం మధ్యలో ఇమిడిపోయిన మనిషి అసలు ఆ పేరుకి తగ్గట్టు చివరికైనా వెళ్లగలిగాడా అని చూడడం ఒక దారం. ముఖ్యమైన పాత్రలే కనీసం పదిహేను ఇరవై ఉంటాయి. మరీ ముఖ్యం అంటే హీనపక్షం ఆరేడుమంది. విషయవిస్తృతి ఎక్కువే అందుకే అంత పెద్ద పుస్తకం. ఈ కథ ఇక్కడితో ముగిసిపోలేదు. శ్రీలంక అంతర్యుద్ధానికి తర్వాతి పుస్తకంలో కదిలిపోతాడు. ఒక్క వంద పేజీలు తక్కువట. నేను దాన్ని చదవాలని అస్సలు అనుకోవడంలేదు ఇప్పుడైతే 🙂
చాలా విజవంతమైన నవల. వార్నర్ బ్రదర్స్ వాళ్ళు జానీ డెప్ తో సినిమాగా తీయాలని 2015 దాకా ప్రయత్నం చేసారు, చాలా బాక్గ్రౌండ్ వర్క్ నడిచింది, స్క్రీన్ప్లే అడాప్ట్ చేసారు, ఒకళ్ళిద్దరు డైరెక్టర్లని హీరోలని మార్చారు. కానీ ఎందుకో ఆగిపోయింది. జానీ డెప్ ప్రొడ్యూసర్ గా అయినా చెయ్యాలనే అనుకుంటున్నాడట, ఏమో వస్తుందేమో!!
కథ రాయట్లేదు కాబట్టి కొన్ని quotable వాక్యాలు ఇక్కడ పెడుతున్నా citation తో పాటు. ఈ క్రెడిట్ పూర్తిగా ఆ స్టడీ గైడ్ వాళ్ళకే. ఇంకా ఇంటరెస్ట్ మిగిలిన వాళ్ళు చూడండి.
Shantaram - few Quotes
“It took me a long time and most of the world to learn what I know about love and fate and the choices we make, but the heart of it came to me in an instant, while I was chained to a wall and being tortured. I realised, somehow, through the screaming in my mind, that even in that shackled, bloody helplessness, I was still free: free to hate the men who were torturing me, or to forgive them.”
“What we call cowardice is often just another name for being taken by surprise, and courage is seldom any better than simply being well prepared.”
“They nailed their stakes into the earth of my life, those farmers. They knew the place in me where the river stopped, and they marked it with a new name. Shantaram Kishan Kharre. I don't know if they found that name in the heart of the man they believed me to be, or if they planted it there, like a wishing tree, to bloom and grow. Whatever the case, whether they discovered that peace or created it, the truth is that the man I am was born in those moments, as I stood near the flood sticks with my face lifted to the chrismal rain. Shantaram. The better man that, slowly, and much too late, I began to be.”
“It's a fact of life on the run that you often love more people than you trust. For people in the safe world, of course, exactly the opposite is true.”
"You know, Lin," he said softly, "we have a saying, in the Pashto language, and the meaning of it is that you are not a man until you give your love, truly and freely, to a child. And you are not a good man until you earn the love, truly and freely, of a child in return."
“What characterises the human race more, Karla once asked me, cruelty, or the capacity to feel shame for it? I thought the question acutely clever then, when I first heard it, but I'm lonelier and wiser now, and I know it isn't cruelty or shame that characterises the human race. It's forgiveness that makes us what we are. Without forgiveness, our species would've annihilated itself in endless retributions.”
"The universe," he continued, "this universe that we know, began in almost absolute simplicity, and it has been getting more complex for about fifteen billion years. In another billion years it will be still more complex than it is now. In five billion, in ten billion -- it is always getting more complex. It is moving toward...something. It is moving toward some kind of ultimate complexity. We might not get there. An atom of hydrogen might not get there, or a leaf, or a man, or a planet might not get there, to that ultimate complexity. But we are all moving towards it -- everything in the universe is moving towards it. And that final complexity, that thing we are all moving to, is what I choose to call God. If you don't like that word, God, call it the Ultimate Complexity. Whatever you call it, the whole universe is moving toward it."
“At first, when we truly love someone, our greatest fear is that the loved one will stop loving us. What we should fear and dread, of course, is that we won't stop loving them, even after they're dead and gone. For I still love you with the whole of my heart, Prabaker. I still love you. And sometimes, my friend, the love that I have, and can't give to you, crushes the breath from my chest. Sometimes, even now, my heart is drowning in a sorrow that has no stars without you, and no laughter, and no sleep.”
“There was a horrible, blood-freezing scream somewhere very close. I suddenly recognized it as my own, but I couldn't stop it. And I looked at the men, the brave and beautiful men beside me, running into the guns, and God help me for thinking it, and God forgive me for saying it, but it was glorious if glory is a magnificent and raptured exaltation. It was what love would be like, if love was a sin. It was what music would be, if music could kill you. And I climbed a prison wall with every running step.”
“Looking at the people, listening to the breathing, heaving, laughing, struggling music of the slum, all around me, I remembered one of Khaderbhai's favourite phrases. Every human heartbeat, he'd said many times, is a universe of possibilities. And it seemed to me that I finally understood exactly what he'd meant. He'd been trying to tell me that every human will has the power to transform its fate. I'd always thought that fate was something unchangeable: fixed for every one of us at birth, and as constant as the circuit of the stars. But I suddenly realised that life is stranger and more beautiful than that. The truth is that, no matter what kind of game you find yourself in, no matter how good or bad the luck, you can change your life completely with a single thought or a single act of love.”

No comments: