Thursday, May 20, 2021

కంబాలపల్లి కథలు

 


ఈ సినిమాని నెట్ఫ్లిక్స్ లో వేసేసి 1.25x లో మొత్తం తిప్పేసి, అక్కడక్కడా 1.5x కూడా తగిలించి గంటన్నర లేదా ఇంకాస్త తక్కువ సినిమా చేస్తే మహా గొప్పగా వుంటుంది, ఇది చాప్టర్ ఒకటి అన్నారు కాబట్టి ఈ మాట చెప్పడం (ఓటీటీ గాళ్ళు అని ఇందుకే తిడతారు, అయినా చెప్తాం

😌). ఇప్పుడున్నట్టు మాత్రం అబ్బో తిట్టుకుంటారు నన్ను, చూడమని చెప్పినందుకు. ఏంట్రా బాబూ కదలదు ముందుకు అని. సినిమా నిదానంగా వుండడం మాత్రమే మంచి సినిమా లక్షణం కాదు నాయనలారా 🙏🙏🙏
కంబాలపల్లి కథ ఒరిజినల్గా వుంది. చాలా చిన్న ప్లాట్, అందుకే నిడివి కావలసినంతే వుంచడం ముఖ్యం. ప్రియదర్శి తప్ప అందరూ కొత్త వాళ్ళయినా బాగా కుదిరారు. ఆ ఫ్రెండు పిల్లోడు, అమ్మాయ్, శివన్న ఒక రవ్వ ఎక్కువ నచ్చేశారు. కంబాలపల్లి మనుషులు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఊరు అన్నీ బావున్నాయి. పిల్లలు మరీ అమాయకంగా అనిపించారు, బహుశా సహజమేమో!! మా ఫ్లాపీ డిస్కుల కాలంలో కూడా చెప్పులు లాబ్ బయటవదలాలని చంపేవాళ్ళు లాబ్ అసిస్టెంట్లు 😁 పాపమ్ కంబాలపల్లికి కంప్యూటర్ అన్న కాన్సెప్ట్ ఏలియన్ కాన్సెప్ట్ గా ఉన్న కాలం.
ఏమైనా, మంచి ఎడిటర్ దొరికితే ఇంకో మంచి డైరెక్టర్ (ఉదయ్ గుర్రాల) దొరికినట్టే తెలుగు సినిమాకి 💖 'ఆహా' లో వుంది.

No comments: