'బాబూ దీనానాథ్ తన కొడుకు శ్రవణ్ కుమార్ వివాహం మాస్టర్ రామ్ కుమార్ కూతురు ఉషతో నిశ్చయం చేశాడు'
మాస్టర్ రామ్ కుమార్ కూతుర్ని బి.ఏ. చదివించడానికే తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు చేసాడు. ఆదర్శ భావాలతో పెంచాడు, మూణ్ణాలుగేళ్లుగా ఉద్యోగం కూడా చేస్తుంది, పెళ్లి మీ ఇష్టమే నాన్నా అని కూడా అనేసింది. వచ్చిన వాళ్లకు ఉష నచ్చకపోయే ప్రశ్న లేదు. ఆగేదంతా పాతికవేలూ, స్కూటర్ దగ్గరో, లక్ష రూపాయల దగ్గరో, 'బంగారం, వజ్రాలు అనే ఆశీర్వచనాల దగ్గరో'.
దీనానాథ్ బోర్డులు పెయింట్ చేయించే వ్యాపారస్తుడు. కొడుకు కూడా అందివచ్చి బానే సాయం చేస్తున్నాడు. మాస్టర్ ఒకరోజు తమ స్కూల్ బోర్డు పెయింట్ చేయించడానికి ఈ దుకాణానికి వచ్చాడు, నమూనా చాక్ పీసుతో రాయించుకుని. దీనానాథ్ ఆ అందమైన దస్తూరి ఉషాదని తెలుసుకుని ముచ్చట పడ్డాడు. ఉష గురించి కనుక్కున్నాడు. తన కాళ్ళ మీద తను నిలబడిందని తెలుసుకు ఇంకాస్త సంతోషపడ్డాడు. ఓ రోజు వాళ్ళింటికి వెళ్లి ఆ అమ్మాయిని పరిచయం చేసుకున్నాడు. ఉషని, మాస్టార్ని తరచుగా వాళ్ళింటికి ఆహ్వానించాడు. ఓ శుభ ముహూర్తంలో శ్రవణ్ కుమార్కి, ఉషకి పెళ్లి కూడా నిశ్చయించారు. మాస్టర్ ఆనందానికి అంతే లేదు. ఆదర్శ భావాలున్న భర్త దొరకడం సులువే కానీ, అంత మంచి మమగారు దొరకడం ఉష అదృష్టమేనని ఆయన తరచూ ఉషతో చెప్పేవారు. దీనానాథ్ గారూ పైసా కట్నం, పూచికపుల్ల బంగారం కూడా వద్దన్నారు. ఉద్యగం తప్పనిసరిగా కొనసాగించే సంపూర్ణ స్వేచ్ఛను మాత్రం ఉషాకిచ్చి.
ఇంత పద్ధతి కాని వ్యవహారం నచ్చని భార్యను ఓదారుస్తూ ఈ మాటలన్నారు. అవి యధాతథంగా. "నువ్వు కోపం తెచ్చుకోకే. నువ్వు మన పెళ్లిలో తెచ్చిన బంగారమేమైనా మిగిలుందా? దుకాణానికి, పన్నులకూ పోయింది. నేను ఇప్పుడు తీసుకువచ్చిన బంగారం ఊపిరి పీలుస్తుంది, బతికుంది. పింఛను, కట్నం రెండూ పోత పోసిన బంగారమిది. నెలకు పధ్నాలుగు వందల జీతం, బొమ్మలేసే ఓ పనివాణ్ణి తీసేస్తే మరో పన్నెండు వందల రూపాయలు మిగులు..... ఏమంటావ్".
మొదటి పరిచయం లో ఇవి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన కథలని రాయడం వదిలేసాను, ద్రౌపది కి రాలేదా అని. ఇవి బహుమతి స్థాయి పెంచే కథలు. తొంభైలకు ముందు రాసి ఉంటారు.
Welcome to the world of breathing Gold and Diamonds.
No comments:
Post a Comment