దొరకదనే అనుకున్నా ఈ పుస్తకం సుజాత గారి కథలు చదివినప్పటినుంచి చదవాలని ఉంది. అనుకోకుండా అమ్మ దగ్గర కనిపించింది తాతయ్య కలెక్షన్లోని పుస్తకం
. కొంచెం రిపేర్లు చేసి ఇవ్వాళ్లే చదివా, ఇంకాస్త బాగు చెయ్యాలి పుస్తకం కొన్నాళ్ళు వుండాలంటే.
సుజాత గారంటే 'సుప్తభుజంగాలు' ఎందుకు గుర్తోస్తుందో చదవగానే తెలిసింది. ఇష్టపడే సిద్ధాంతాలను నమ్మకంగా చక్కని కథ చేసి రాసారు. రీడబిలిటీ సహజగుణమైన రచయిత్రి, ఇంకోమాట లేదు, ఒకే సిట్టింగ్ లో పూర్తి చేసా.
ఈ యేడాది మొదలు
No comments:
Post a Comment