Thursday, May 20, 2021

మారా

 trailer link

ఆ అమ్మాయికి కథలిష్టం.

ఎప్పట్లా నానమ్మ చెప్పే రాజుగారి కథ, నక్క ద్రాక్షపళ్ల కథలు వద్దనిపిస్తుంది. ఓ కొత్త ఫ్రెండ్ఆంటీ రాజుగారు, నక్క లేని కొత్త కథ చెప్పింది.
ఓ సిపాయి కథ, చావేలేని సిపాయి కథ.
ఏ యుద్ధం నుంచి సిపాయి గెలిచే వెనక్కి వస్తుంటాడు, ఎందుకంటే సిపాయి ప్రాణం తన దగ్గర లేదు, ఒక చేపలో వుంది. ఒకసారి ఆ సిపాయి వెనక్కి వచ్చేప్పటికి పేద్ద తుఫాను. తగ్గాక ఇంక చేప కనిపించలేదు. సిపాయి ఆ మీను కోసం వాగులు, వంకలు, నదులు, కొండలు, జలపాతాల్ని అడుగుతూ మహాసముద్రం దాకా వచ్చాడు. ఎక్కడో అడుగున ఉన్న చేప దొరికేసిందా ఆ సిపాయికి!?
'ఛార్లీ' నుంచి 'మారా' ను వేరు చేసింది ఈ కథే; ఇంకా ఈ కథ ప్రోలోగ్ లాగా వచ్చినప్పటి యానిమేషన్, ఆ యానిమేషన్ దృశ్యాలు శ్రద్ధా కళ్ళముందు మూరల్స్ లాగా పరుచుకోవడం, విసువల్ ఫీస్ట్ లాగా ఉన్న ఎనిమిదివేల ఎత్తునున్న స్వర్గపు దృశ్యాలే. చందమామ కథల్ని ఇంకా నమ్మే మనుషులు ఓసారి నెమ్మదిగా చూడొచ్చు.
ఛార్లీ లో ఉన్న మేజిక్ వుండదు కానీ ఫెయిల్ అయిన బోలెడు రీమేకుల్లా లేదు. అటెంషన్ టూ డీటయిల్స్లో చాలా బావుంది, ఆ బాగుండమే చాలా ఎక్కువైంది కూడా. సినిమాగా గొప్ప సినిమా కాదు, చాలా సోమరిగా ఎడిటింగ్ చేశారు లేదా అతిగా ప్రతి ఫ్రేమ్ ని ప్రేమించారు, చాలా సీన్లలో మనకే కత్తెర దొరికితే బావుణ్ణు అనికూడా అనిపిస్తుంది. సినిమా చూడకుంటే నష్టమేమీ లేదు, కానీ ఓ చలికాలపు చల్లటి సాయంత్రాన్ని కాస్త వెలిగించుకోవచ్చు, ముఖ్యంగా ఫెయిరీ టయిల్స్ మీద, సుఖంతపు ప్రేమకథల మీద నమ్మకం ఉన్నవాళ్లు. అమెజాన్ ప్రైమ్ లో వుంది.
షరా: ఎంత అటెన్షన్ టూ డీటెయిల్ ఉన్న డైరెక్టర్ ఐనా హీరోయిన్ చేతిలో ఉన్న చిన్న మేజిక్ బాగ్ లో వారాలకు వారాలకు సరిపడా అన్నన్ని డ్రెస్సులు, ఉంగరాలు, గొలుసులు, బొంగరాలు ఎట్లా పట్టిస్తాడో 🙄 కుళ్లుగా వుంది 😏
అది రియల్ మేజిక్, ఎవరన్నా నేర్పిస్తే బావుణ్ణు 💖😌

No comments: