శ్రీదేవి మురళీధర్ గారు పిల్లలమీద అక్కరతో రాసిన పుస్తకాలు ఇవి. అంటే వాళ్లకి అందమైన భావనా ప్రపంచం కల్పించే ఉద్దేశ్యంతో రాసినవి కావు ఇవి. వారి దెబ్బతిన్న బాల్యంపై, రాబోయే ఇబ్బందికరమైన భావి జీవితంపై అక్కరతో రాసినవి. ఆల్కహాలిక్ తండ్రులు కుటుంబ జీవితాన్ని, పిల్లల బాల్యాన్ని, వాళ్ళ వ్యక్తిత్వ నిర్మాణాన్ని ఎట్లా శిథిలం చేస్తారో; ఆ దుష్ప్రభావాలు వాళ్ళ భావి జీవితాన్ని కూడా మొత్తంగా ఎట్లా పాడు చేస్తాయో వివరంగా లోతైన పరిశోధన ప్రాతిపదిక గా రాసారు. ఇట్లాంటి కుటుంబాలకు, ముఖ్యంగా పిల్లలకు సహాయం చేయడానికి పనిచేసే సంస్థల పూర్తి వివరాలు కూడా ఇచ్చారు. ఇంతా చేసి వీటిని ఉచితంగా ఇస్తున్నారు ప్రత్యక్షంగా అవసరమైన వారికి; పరోక్షంగా ఈ కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలని అర్థం చేసుకుని వాళ్లకు సపోర్ట్ ఇవ్వగల అవకాశం ఉన్నవాళ్ళకి.
ఈ పుస్తకాలు పంపి, శ్రీదేవి గారు నన్ను అడిగింది ఒకటే మాట; చదవమని, చదివాకా ఇంకొకరికి చేర్చమని. నేను చేసింది చదివి అత్తయ్యతో పాటు ఊరికి పంపడం. అక్కడ ఇంటి దగ్గర్లో ఒక పిల్లాడిని కలిసా పోయినసారి వెళ్ళినప్పుడు, భలే ఉత్సాహంగా వున్నాడు. రోజూ వచ్చేవాడు, మాట్లాడి రిషితో కలిసి కాసేపు ముచ్చట పెట్టేవాడు (మీరు చదివింది నిజమే, రిషి ని మాట్లాడించగలిగాడు ). ఇప్పుడు వాడిని ఒక బాధితుడిగా పోల్చుకోగలిగా. ముందు వాడికి ఇచ్చి చదివించి వాళ్ళ అమ్మా నాన్నలకు చెప్పించి తర్వాత లైబ్రరీలో ఇవ్వమని చెప్పా అత్తయ్యతో. చూడాలి కాస్తన్నా సాయం అందుతుందేమో.
పుస్తకాల కోసం శ్రీదేవి గారిని సంప్రదించవచ్చు. ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలని మనిషి
No comments:
Post a Comment