Monday, May 23, 2022

పెరివింకిల్ రంగు చీరమీద లావెండర్ చుక్కలు

 


మన సేల్సబ్బాయి స్వగతంలో: "బాబోయ్ ఎవరూ వచ్చేది!! 'అరిటాకుపచ్చకు మామిడిచిగురంచు' 'చిలుకాకపచ్చకు ముక్కుపొడుము రంగు' చీరలు చూపించు బాబూ అని అడిగే అమ్మగారేనా!! ఏంటో ఈవిడ తెలుగు మాట్లాడినా నాకు అర్థం కాదు. అయినా ఈసారి ఊళ్ళో మా అమ్మమ్మనడిగి ఈ పేర్లన్నీ తెలుసుకున్నా కదా ఇంక ఠారెత్తించడమే."

మన సేల్సబ్బాయి ప్రకాశంగా: "రండి రండి మేడమ్ ఈసారి మీరడిగే రంగులన్నీ వున్నాయి, ఇవిగోండి 'కనకాంబరానికి నెమలిపింఛమ్ రంగుఅంచు', 'ఆకాశనీలానికి బచ్చలిపండురంగు అంచు', 'ఆనందం రంగుకి నెరేడుపండు రంగంచు', 'నిమ్మపండు రంగుకి కృష్ణనీలం అంచు' ఇన్నెందుకు 'ఇంద్రనీలంనెమలికంఠం కలనేత' దాకా అన్నీ వున్నాయి. మీ ఇష్టమైనది తీసుకోండి."
చిలుకాకపచ్చకు మామిడిచిగురంచు అమ్మగారు: "ఈసారి తెలుగురంగులొద్దులే బాబూ, మా మనవరాలు ఇంగ్లీషు రంగులు నేర్పిస్తుంది ఈమధ్య వాటిలో చూపిద్దూగానీ!!☺️"
మన సేల్సబ్బాయి స్వగతంలో: 'హమ్మయ్య!! పోనీలే ఇవన్నీ నేర్చుకుంటే నేర్చుకున్నా గానీ ఇంకీవిడ మనకర్థమయ్యే భాషలో గ్రీన్, బ్లూ, యెల్లో, రెడ్, పర్పుల్ మహా అయితే మెజాన్తా, ఆక్వా అని అడుగుతుంది. ఏవో తిప్పలు పడొచ్చు.'
మన సేల్సబ్బాయి ప్రకాశంగా: 'ఓహో! ఇంకేమీ!! ఏ రంగు చీరలు చూస్తారో చెప్పండి మరి"
చిలుకాకపచ్చకు మామిడిచిగురంచు అమ్మగారు: "పెరివింకిల్ రంగు చీరమీద లావెండర్ చుక్కలు చిలకరించినట్టు ఏమన్నా చూపించు బాబూ"
మన సేల్సబ్బాయి స్వగతంలో, ప్రకాశంగా: "దేవుడా!! నాకేదీ దారి!! 🤦🤦🤦🤦🤦🤦"
డిస్క్లైమర్: పండగ చీరల వ్యవహారాలకీ, ఈ పోస్టుకి ఏ సంబంధం లేదు 🙈🙉🙊
Photo credit: Google Images

No comments: