Monday, May 23, 2022

పర్యావరణ కథలు - పూర్ణచంద్ర తేజస్వి - శాఖమూరు రామగోపాల్

 

'అవునండీ, దెయ్యనికి రూపమంటూ వుండాలి కదా!' అన్నారు షా.
'ఏంచేత అట్లా అంటున్నారండీ?'
'మరి నరమనుషుల కళ్ళకి కనపడాలంటే రూపం కావద్దూ'
'అవునండీ, మీరన్నది నిజమే. మన కళ్ళకి కనపడాలంటే మరి దెయ్యానికి రూపం కావలసే వుంటది'
'సరేనండీ!! కళేబరానికి ఒక రూపం ఉన్నట్టు ఏదో రూపం ధరించి వచ్చిందనుకున్నా ఇది దెయ్యం రూపం అని మనకెట్లా తెలియడం?'
'దయ్యం యువతి రూపంలో వచ్చిందనుకోండి, అప్పుడు మనకు ఈ అర్ధరాత్రి శ్మశానంలోకి యువతి ఎందుకు వస్తుంది అన్న అనుమానం వస్తుంది కదా! తక్షణమే ఆ యువతిని దయ్యం అనుకోవచ్చు!'
'అదేనండీ, నేను ఆలోచిస్తుంది దెయ్యం యువకులను చూస్తే అందమైన యువతిలాగా, యువతిని చూస్తే అందమైన యువకుడిలాగా వస్తాదన్నది కూడా మన ఊహే కదా!! ఇదేమీ కళాశాల కాదు కదా, ఒక బఱ్ఱెలాగానో, గాడిదలాగానో రావచ్చుగా!'
'సరేనండీ! అప్పుడుకూడా మనకు అనుమానం వస్తది కదా, వారసులు లేని బఱ్ఱెగా అర్థరాత్రి శ్మశానం లోకి ఎందుకువచ్చింది అని?'
'ఔనండీ!! అయినా ఈ ప్రశ్న అంత తేలిక కాదని తెలుసుకోండి. ఒకవేళ దెయ్యం మీ రూపంలోనో, నా రూపంలోనో వస్తే అప్పుడెట్లాగంటారు?'
'అయ్యో! అట్లా రానీయండి చూద్దాం, వస్తే కదా సమస్య!' అంటూ చేతిలో వున్న కర్రతో చితి మీదున్న బూడిద కుప్ప కెలికా.
ఇంకాసేపు శ్మశానవాసం చేశాక, షా గారి ప్రశ్న గట్టి అనుమానం అయ్యింది నాకు.
'దెయ్యాలు నరమనవుల రూపంలో వచ్చి మనకి కష్టాలు ఇచ్చేది ప్రారంభం చెయ్యకముందే మనమ్ ఇక్కణ్ణుంచి వెళ్లడం మంచిదేమోనండీ షా!! మరి ఏమంటారు!!'
'నేనూ దానిగురించే ఆలోచిస్తుంటే ఒక యోచన తోచిందండీ. తుంటరి దయ్యాలు మన రూపాల్నే ధరించివచ్చి మన ఎదురుగ్గా నిలబడ్డా మనల్ని మోసగించకుండా నిలబెట్టోచ్చునండీ, ఇల్లా చేస్తే!'
'ఏమిటండీ! మీ యోచన?'
'చూ బిట్సీమ్: కుంట్సుఫు'
అదేమిటనేది తెలియక గలిబిలి అయ్యి 'ఇదేం మంత్రమండీ, మేడిన్ జపాన్ మంత్రం లాగా వుందీ!' అడిగా.
'ఇది మేడిన్ చైనా మంత్రమండీ!!...........'
****************
ఇక దీని తరువాత ఈ దెయ్యాల కథ ఎట్లా ముందుకు పొయ్యిందో, ఆ చైనా మంత్రాల మహిమ ఏమిటో మరి మీరు తెలుసుకోవాలనుకుంటే మా కువెంపు గారబ్బాయి పూర్ణచంద్రతేజస్వి గారి 'పర్యావరణ కథలు' చదవాల్సిందేనండీ.
ఈ వొక్క కథే కాదు మిగిలిన అన్ని కథలు ఇంతే మోస్తరుగా ఇట్లాంటి బాక్డ్రోప్ అంటే అన్నీ శ్మశానంలో అని కాదు అడివి లాంటి ఎస్టేట్ నేపథ్యంలో కథలు. ఏ వస్తువుకు రంగుల వేసి చూపించరు, అన్నీ నికార్సైన మాటలు మరి. అన్నీ ఇట్లాగే మంచి హాస్యంగా వుంటాయి గానీ, ఆ హాస్యం మీకు అర్థం కాకపోతే నా పూచీ ఏమీ లేదు. మాస్తి, బైరడు, ప్యారడు, వెంకడు, సుస్మిత, పక్షిపిల్లలు, దెయ్యం కోడి, కాళప్ప గారు ఆయన కోబ్రా, గాడ్లి ఆయన కోతులు యింకా మన పూర్ణచంద్ర తేజస్వి గారు యిట్లాగ బలే మనుషులు, జీవులులే పుస్తకం నిండా.
ఈ పుస్తకం శాఖమూరు రామగోపాల్ గారు తెలుగు చేసారు. ఆ తెలుగు చాలామందికి సరిగా అనిపించలేదట, కానీ నాకైతే భలే సరిగా అనిపించిందండీ. అసలు మాటలు కన్నడంలో యిట్లాగే వున్నాయేమో అనిపించిందండీ మరి. పుస్తకం దొరికే అడ్రెస్ బొమ్మ పెడుతున్నా. ఈ పుస్తకం కర్టసి పూర్తిగా సుస్మితదేనండీ. అంటే కువెంపు గారి మనవరాలు సుస్మిత కాదు మన సుస్మితే. పుస్తకం ఇచ్చేసి మర్చిపోకుండా చదివానా లేదా అని అజాపజా కనుక్కోవడం గొప్పే కదండీ మరి. వారికేమో మరి బోల్డు ప్రేమతో ధన్యవాదాలు 😍🙏
Nirmala Devi Tangella, Kalyani Neelarambham and 34 others
14 Comments
Like
Comment
Share

No comments: