పోస్టులు పాతవి. తిట్టాలి అనుకునేవాళ్ళని, మెచ్చుకోవాలి అనుకునేవాళ్ళనీ ఎవరినీ చిన్నబుచ్చకుండా ఏడా పెడా రాసిపారేసా రెండూ పోస్టుల కంటే కామెంట్లు బాగుండే ఒక సందర్భం, అందుకే ఆ లింకులు కూడా ఇచ్చా. ఓపికున్నవాళ్లకు ఓపికున్నంత మహాదేవా!!
#2
సూఫీ ఇంద్రజాల సంగీతం, మైమరచిపోయి చేసే నాట్యం, మాట్లాడే నవ్వే కళ్ళు, భూపాలరాగానికి తగ్గని 'అజాన్', తెలిమంచు దుప్పట్లలోంచి చూపించే కేరళ పల్లె, పాత కొత్తల కలయికగా బోల్డు చెట్ల మధ్యలో రెండు అంతస్థుల ఇల్లు, చెక్క మెట్లమీద నుంచి కిందకు దిగుతున్న వెండి గొలుసుల పచ్చని పాదాలు, జమిలిగా కలిసిపోయినట్లున్న హిందూ ముస్లిం కుటుంబాల సంబంధాలు, ఓ అమ్మాయి శారీరక వైకల్యాన్ని ఏ చిన్న నొచ్చుబాటు లేకుండా ఒప్పుకునే మనుషులు, సైకిల్ తొక్కుతూ లోకం చుట్టబెట్టేసే లంగా ఓణీ అమ్మాయి, భార్య లోటుల్నీ సర్దేసుకునే భర్త, మాంత్రికలోకపు సంగీతం, పచ్చదనం, పచ్చదనం, పచ్చదనం.
ఇదేంటబ్బా పొద్దున్న పూర్తి ఉల్టా రాసింది, ఇప్పుడుమళ్లీ సిన్మా చూసి మనసు మార్చుకుందా ఏంటి ఈ మనిషి!? అస్సలు కాదు.
షరా: లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ సమానంగా పనిచేస్తున్నాయనిన్నీ; ఈనాడుకీ, సాక్షికీ రెండు చేతుల్తో రాసి పారేయ్యగలననిన్నీ చెప్పాలకదా మరి
#1
ఈ చిత్రరాజం చూసాక వద్దన్నా 'దేవరాగం' గుర్తొస్తుంది. వేరే వేరే కథలే!!
వేరువేరు!? కథలా!?
సమ్మోహనంగా ఉన్న అరవింద స్వామి అక్కడ, దేవ్ మోహన్ ఇక్కడ. Ethereal గా ఉన్న శ్రీదేవి అక్కడ, అదితి ఇక్కడ (శ్రీదేవి లంగా ఓణీలే బాగా నచ్చాయి, నేను ఓల్డ్ ఫాషన్డ్ కదా మరి) . మధ్యలో ఒక చచ్చే బకరా అక్కడ, బతికేఉన్న బకరా (ఫిమేల్ చావునిస్టిక్!?) ఇక్కడ.
ఇంద్రజాలం లాంటి సంగీతం. బ్రహ్మాండమైన లోకేషన్స్. ఒక మంచిపిచ్చి తండ్రి.
ఏం చెప్పాలో సరిగ్గా ఆలోచించుకోకుండానే తీసేసిన డైరెట్రూలు. రెండూ మళయాళం సిన్మాలే.
అన్నిటికీ మించి ఒక బుర్ర తక్కువ నేను.
అంతే.
'లవ్ జిహాద్' అని సిన్మాలోనే బలవంతంగా చెప్పారు కాబట్టి కానీ, తొక్కలో సిన్మాకి అంత దృశ్యం లేదు.
షరా: ఇప్పుడు మలయాళం సిన్మా ని తిట్టా కాబట్టి మేధావి అని తిట్టే తెలుగు ఫాన్స్ మెచ్చుకుంటారా!? మలయాళం సిన్మాని కూడా తిట్టాను కాబట్టి మేధావులైన మలయాళం సిన్మా ఫాన్స్ తిడతారా!? ఓటిటి ప్లాట్ఫారంలో చూసి బోడి రివ్యూలు ఇవ్వొద్దు అనే సిన్మా రంగం ప్రేమికులు తిడతారా!?
No comments:
Post a Comment